GET sakshi.com HTTP 200137 ms281.3 KB$0.000843 captured Aug 7, 2026
sakshi.com, as data
One API turns any sakshi.com page into markdown, structured JSON, its link graph or a screenshot, and crawls the whole site the same way. The panel shows the real response we captured.
- Render mode
- Plain HTTP, no browser needed
- Response
- HTTP 200 in 137 ms
- Page size
- 281.3 KB of markdown, 985 lines
- Fields
- Business Name, Address, Phone, Category
- Captured
- Aug 7, 2026
Free balance on signup, no card. This sakshi.com page cost $0.000843 to fetch.
Online Telugu Breaking News Today## సినిమా##### రామ్ చరణ్ పెద్ది.. పెద్ద మైనస్ అదొక్కటే..! మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీకి టాలీవుడ్ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు. పరుచూరి పాఠాలు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్‌తో కథను నడిపించడం అద్భుతంగా ఉందన్నారు. మూవీ చివర్లో ఇచ్చిన సందేశం తనకు నచ్చిందన్నారు.ఒక చిన్న పాయింట్ తీసుకుని మూడు గంటల సినిమా తీయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే పెద్ది రన్‌టైమ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని తెలిపారు. రామ్ చరణ్ కాకుండా మరెవరైనా చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నా అభిప్రాయమని వెల్లడించారు. ఈ సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాలపై మోశారని ప్రశంసించారు. అతని వల్లే పెద్దికి కలెక్షన్స్ వచ్చాయని పరుచూరి తెలిపారు.పరుచూరి మాట్లాడుచూ.. 'ఓట్లే లేని ఊర్లో రైలు ఆగాలనే పాయింట్ తీసుకుని గొప్పగా రాశారు. ఎలా అయినా ఊరికి గుర్తింపు తీసుకురావాలని హీరో క్రికెట్, కుస్తీల్లో ఓడిపోయినప్పటికీ.. చివర్లో రన్నింగ్‌లో సత్తా చాటి తన పోరాటంలో అనుకున్నది సాధించాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ వేషధారణలు ఏవీ తెలుగు వాళ్లకు నచ్చేలా లేకపోవడం పెద్ద మైనస్. హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ మూవీ రన్‌టైమ్ ఇంకా 30 నుంచి 40 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది. నిడివి తగ్గించి హీరోయిన్ పాత్ర ఎక్కువ చూపించి ఉంటే ఓటీటీలో ఇంకా ఆదరణ దక్కేదేమో' అని అన్నారు.##### నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)##### ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అలా ఈ ఏడాది ఈమె నుంచి వచ్చిన మూవీ 'భారత భాగ్య విధాత'. 26/11 దాడుల నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకుడు. 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలోని కామా ఆస్పత్రిలో అంజలి అనే నర్స్, 20 మంది గర్భిణిలని రక్షించింది. ఆమె జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు. జూన్ 12న థియేటర్లలో రిలీజైంది గానీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం (ఆగస్టు 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.26/11 టెర్రర్ ఎటాక్ సమయంలో ఆస్పత్రిలో రోగులని కాపాడిన గీతా మాధవ్ (కంగనా రనౌత్) అనే నర్స్ పోరాటం, ఆమె ధైర్యం, అలానే ఈమెకు తోడుగా మరికొందరు నర్సులు కూడా ఎలాంటి సాహసం చేశారు? చివరకు ఏమైందనేదే 'భారత భాగ్య విధాత' స్టోరీ.ఇకపోతే ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)An untold story of ordinary nurses who stood with extraordinary courage on the darkest night of 26/11.Some heroes were never seen. Their stories were never told.Until now.Bharat Bhhagya Viddhaata Trailer Out Now.#BharatBhhagyaViddhaata premieres on 14th Aug on Hindi Zee 5… pic.twitter.com/gq6b61Piet— ZEE5Official (@ZEE5India) August 7, 2026## ఫోటో స్టోరీస్#### క్రీడలు##### అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్ శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆరు శతకాలుటెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్‌లో అత్యుత్తమంగా రాణించాడు.అయితే, శ్రీలంకలో గిల్ రెడ్‌బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడే అసలైన పరీక్షబ్యాటింగ్ పిచ్‌ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్‌ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.చదవండి: భారత్ తోమ్యాచ్.. వన్డే తరహాలో లంక ఓపెనర్ దూకుడు##### టీమిండియా వైపు దూసుకొస్తున్న నయా పేస్ గుర్రం.. ఎవరంటే? టీమిండియా వైపు మరో పేస్ సంచలనం దూసుకొస్తున్నాడు. గంటకు 145 కి.మీ వేగానికి పైగా బంతులు విసిరి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత తరపున అదరగొట్టిన ఈ యువ పేసర్.. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తాచాటాడు.అతడే 18 ఏళ్ల స్పీడ్‌స్టర్ దీపేష్ దేవేంద్రన్. దీపేష్ బుధవారం తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మధురై పాంథర్స్ తరపున టీఎన్‌పీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే దేవేంద్రన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగలిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతిని ఏకంగా 146 కి.మీ/గం వేగంతో విసిరి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్‌లో మరో మూడు సార్లు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అతడు కచ్చితంగా భారత సీనియర్ జట్టులోకి వస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అతడి టీమ్‌మేట్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాగా గత కొంత కాలంగా దీపేష్ వైట్‌బాల్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఆసియాకప్-2025 ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికి.. దీపేష్ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అదరగొట్టాడు.బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌లు కలిసి దీపేష్ పది వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున అతడు సత్తాచాటాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్-2026ను భారత్ సొంతం చేసుకోవడంలో దీపేష్‌ది కీలక పాత్ర. సెమీస్, ఫైనల్లో కలిపి అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం##### పతకాలు తెచ్చాను.. నాపై ఇంత విద్వేషమా? పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఒక ఈవెంట్లో విఫలమైనంత మాత్రాన తనను దూషించడం సరికాదన్నాడు. తాను దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానని.. అయినప్పటికీ తనను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఒలింపిక్స్‌లో స్వర్ణంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈటెను రికార్డు స్థాయిలో 92.7 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచాడు. తద్వారా విశ్వ క్రీడల్లో పాకిస్తాన్‌కు తొలి వ్యక్తిగత పసిడి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.సీన్ రివర్స్‌ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై ఇంటా.. బయట ప్రశంసల వర్షం కురిసింది. సన్మానాలు, సత్కారాలతో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్స్‌ల మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు.తాజాగా గ్లాస్కో వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2026లోనూ అర్షద్ నదీమ్ వైఫల్యాలు కొనసాగాయి. కామన్‌వెల్త్ గేమ్స్-2022లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాడు. దారుణ వైఫల్యంతో..అయితే, తొలి ప్రయత్నంలోనే బ్యాలెన్స్ చేసుకోలేక ఫౌల్ కావడంతో ఫైనల్ రౌండ్‌లో అతడికి చేదు అనుభవమే మిగిలింది. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైన అర్షద్ నదీమ్ టాప్-8కు చేరలేక ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈసారి కనీసం కాంస్యం కాదు కదా.. ఫైనల్లో మరో మూడు ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండానే నిష్క్రమించాడు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్షద్ నదీమ్‌పై ఘాటు విమర్శలు చేశారు. అభ్యంతరకర పదజాలంతో అతడిని తిట్టారు.నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినేఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ తాజాగా స్పందించాడు. ‘‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో నా వైఫల్యానికి సంబంధించి నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే, నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే.పతకాలు అందించానుగతంలో దేశానికి ఎన్నో పతకాలు అందించాను. కానీ నా పట్ల అమర్యాదపూర్వకంగా, మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. నేనూ మీలో ఒకడిననే గుర్తించండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని చెబుతూ నా తల్లిదండ్రులు నాకు చెప్పారు.నేను లాగే ఉన్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతుల వల్ల నేనేమీ పొగరుబోతులా తయారుకాలేదు. చలి ఎక్కువగా ఉన్న చోట జావెలిన్ త్రోయర్ల కండరాలు పట్టేయడం సహజం. రిథమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు.. క్రీడా వేదిక పరిస్థితులు వేరు.ఏదేమైనా గ్లాస్గోలో నేను మెరుగ్గా రాణించాల్సింది. కానీ గెలవలేకపోయాను. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషి చేస్తాను. కఠిన శ్రమనే నమ్ముకున్న నాకు ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.అందుకే ఫెయిల్ అయ్యాడా?కాగా అర్షద్ నదీమ్ తన కోచ్‌గా సల్మాన్ బట్‌ను కొనసాగించడంతో.. పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్‌తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేందుకు అతడికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు వచ్చాయి. లాహోర్‌లో ఎర్రటి ఎండలో అర్షద్ ప్రాక్టీస్ చేయగా.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో అందుకు విరుద్ధంగా పూర్తి చలి వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే తరహాలో లంక బ్యాటర్ల విధ్వంసం##### భారత్‌తో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ ఓపెనర్ నిశాన్ మధుష్క దుమ్ములేపాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి వన్డే మాదిరి బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లోనే నిశాన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రనౌట్ కావడంతో....ఓపెనర్ నిశాన్ మధుష్క భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న అతడు పదకొండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 66 పరుగులు చేశాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత పేసర్లు, స్పిన్నర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.అయితే, 21వ ఓవర్లో మానవ్ సుతార్ వేసిన బంతిని ఎదుర్కొని పరుగు తీసే క్రమంలో రవిందు రశాంతతో సమన్వయ లోపం కారణంగా.. నిశాన్ రనౌట్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు భారత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక మరో ఓపెనర్ రవిందు కూడా నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 82 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యంనిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా నిలకడగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక ఎలెవన్ జట్టు 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 138 పరుగులు సాధించింది. రవిందు 50, పసిందు 16 పరుగులతో క్రీజులో నిలిచారు. నిశాన్- రవిందు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.భారత బౌలర్లు విఫలంభారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్.. ఇలా ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. బ్రార్ నాలుగు ఓవర్లలోనే అత్యధికంగా 25 పరుగులు సమర్పించుకోగా.. సుతార్, సిరాజ్ 5 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి పొదుపు పాటించారు. జడ్డూ 5 ఓవర్లలో 29, కుల్దీప్ 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చుకున్నారు. ప్రసిద్ 5 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియా-శ్రీలంక ఎలెవన్ మ్యాచ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్## న్యూస్ పాడ్‌కాస్ట్ What Spider does on sakshi.com
Same key, five endpoints. The numbers under a cell were measured on this page.
Page to markdown
Clean text for RAG and LLM context, boilerplate removed. The lane that runs without a key.
137 ms · $0.000843Page to JSON
Spider reads the page and names the fields. Pass your own schema when you need exact keys.
Rendered capture
Real Chromium, full-page PNG. The same call also returns the rendered HTML.
The call behind the panel
This request produced the response above. Paste it with your key and you get the same bytes.
curl -X POST https://api.spider.cloud/scrape \
-H "Authorization: Bearer $SPIDER_API_KEY" \
-H "Content-Type: application/json" \
-d '{"url": "https://sakshi.com/", "return_format": "markdown"}' from spider import Spider
app = Spider()
params = {"return_format": "markdown"}
page = app.scrape_url("https://sakshi.com/", params=params)
print(page[0]["content"]) import { Spider } from "@spider-cloud/spider-client";
const app = new Spider();
const [page] = await app.scrapeUrl("https://sakshi.com/", {
return_format: "markdown",
});
console.log(page.content); What sakshi.com costs
Multiplied from the measured 281.3 KB page. Estimates round to the cent.
1 GB of transfer costs $1, plus $0.001 per CPU minute, and failed requests cost $0. Crawling daily? The Unlimited plan is a flat monthly rate.
Point this at the rest of sakshi.com.
The capture above took 137 ms and cost $0.000843. The same call takes any URL on sakshi.com.